28 July, 2026 | 3:44 PM

బాలల హక్కుల పరిరక్షణకు విద్యే బలమైన ఆయుధం

28-07-2026 02:51 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో బాలల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి బాలుడు తప్పనిసరిగా విద్యార్థిగా ఉండాలని, చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని అన్నారు. చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పోషకాహారం అందిస్తోందని, అలాంటి పిల్లలను గుర్తించి అవసరమైన సేవలు అందించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు.