28 July, 2026 | 3:43 PM

గుంతలతో గజిబిజి రహదారి.. వాహనదారుల అవస్థలు

28-07-2026 02:40 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మొండికుంట–అశ్వాపురం–మణుగూరు ప్రధాన రహదారి వర్షాలతో పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో భారీ గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు తెలియక ద్విచక్ర వాహనాలు జారిపడుతుండగా, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్‌లు, పాఠశాల వాహనాల రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారాయి. గతంలో చేసిన తాత్కాలిక మరమ్మతులు ఫలితం ఇవ్వలేదని, ఇప్పటికైనా అధికారులు శాశ్వతంగా రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.