19 May, 2026 | 1:45 AM

షాద్‌నగర్ కాంగ్రెస్‌లో నయా జోష్..

19-05-2026 12:40 AM
  1. మున్సిపాలిటీ, మండల అధ్యక్షుల జాబితా విడుదల
  2. పాత, కొత్త కలయికతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు
  3. షాద్నగర్ మున్సిపల్ బాస్ నలమోని శ్రీధర్.. 
  4. కొత్తూరులో మళ్లీ సుదర్శన్ గౌడ్‌దే హవా

షాద్నగర్, మే 18 (విజయక్రాంతి): షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ, మండలాల నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. స్థానిక సమీకరణాలు, నమ్మకమైన నాయకత్వమే ప్రాతిపదికగా రూపొందించిన అధికారిక జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం విడుదల చేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా, అందరూ ఊహించినట్లుగానే బలమైన నాయకుడు నలమోని శ్రీధర్ అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు, కొత్తూరు మున్సిపాలిటీలో తన పట్టును నిరూపించుకుంటూ సుదర్శన్ గౌడ్ రెండోసారి యధావిధిగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

మండలాల వారీగా కొత్త బాస్లు వీరే..నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అధిష్టానం ఖరారు చేసిన నూతన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూక్ నగర్ మండలానికి కుమ్మరి శ్రీనివాస్,కొందుర్గు మండలానికి పురుషోత్తం రెడ్డి,చౌదరిగుడ కు చంద్రశేఖర్, కొత్తూరు కు శేఖర్ రెడ్డి, నందిగామ కు కుమారస్వామి, కేశంపేటకు రమేష్ ను నియమించారు. ఇటీవల నియోజకవర్గ స్థాయి నుంచి పంపిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.