30 July, 2026 | 2:14 AM

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ‘ఇన్స్‌పైర్ -2026’

30-07-2026 01:29 AM

ఉపాధ్యాయులకు సన్మానం.. విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

ఇబ్రహీంపట్నం, జులై 29 (విజయక్రాంతి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో గురుపూర్ణిమ పురస్కరించుకుని ’మల్రెడ్డి యువశక్తి’ నేతృత్వంలో మల్రెడ్డి అభిషేక్రెడ్డి సారథ్యంలో ’ఇన్స్పైర్-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకలో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి,

డిఇఓ వెంకటేశ్వర్లు, ఏసీపీ కె.వి. రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న 60 మందికి పైగా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే మల్రెడ్డి అభిషేక్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలోని 2,000 మంది విద్యార్థులకు జ్యామెట్రీ బాక్సులు, వాటర్ బాటిల్స్ సహా ఇతర విద్యాసామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.