29 June, 2026 | 2:47 AM

డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు

29-06-2026 12:00 AM

గోవిందరావు పేట, జూన్ 28, (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఆదేశాల మేరకు ములుగు డీఎస్పీ రవీందర్ సూచనల మేరకు పసర సిఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్ ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఆదివారం గోవిందరావుపేట మం డలం పసర, చల్వాయి,  గ్రామాల్లో కిరాణా దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధిత మత్తు పదార్థాలు, గుట్కా తదితర వస్తువులను విక్రయించవద్దని ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు.