దోమకొండ శాంతినగర్ ఎస్‌ఐఆర్ కేంద్రం పరిశీలన
గణన ఫారాల పంపిణీ, సేకరణలో అప్రమత్తంగా ఉండాలని బిఎల్‌ఓలకు సూచన
దోమకొండ, జూలై 10 (విజయ క్రాంతి): దోమకొండ గ్రామంలోని 96వ బూత్, మూడో వార్డు శాంతినగర్లో ఏర్పాటు చేసిన ఎస్ ఐ ఆర్ కేంద్రాన్ని గ్రామ ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న జి పి ఓ, బి ఎల్ ఓ లతో మాట్లాడిన ఆయన, ఎన్నికల సంఘం నిర్దేశించిన గణన ఫారాలను ప్రతి ఓటరికి అందజేసి, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయించి గడువులోగా సేకరించాలని సూచించారు.
బి ఎల్ ఓ లు ప్రతి కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి, అవసరమైన సహాయం అందించాలని అన్నారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో బి ఎల్ ఓ ల వద్ద ఓటరు జాబితా అందుబాటులో లేదని సమాచారం వచ్చిందని, అలాంటి పరిస్థితి ఉంటే వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఓటరు జాబితాను తెప్పించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యుడు పాలకుర్తి శేఖర్ మాట్లాడుతూ, గ్రామంలో చాలా మంది తమకు గణన ఫారాలు అందలేదని చెబుతున్నారని, ప్రతి ఇంటికి ఫారాలు చేరేలా తహసీల్దార్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగారపు ఎల్లయ్య, ఐరేని రాజేందర్, కూర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






