జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జూలై 10 (విజయక్రాంతి): కరీంనగరం పురవీధుల్లో ఈనెల 16 పెద్ద ఎత్తున జరిగే జగన్నాథ రథయాత్రకు భారీ ఏర్పాట్లు చేపడుతున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బి సి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జగన్నాథ రథయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ పూరీలో ఈనెల 16న జరిగే రథోత్సవం రోజున మన కరీంనగర్ పట్టణంలో కూడా నిర్వహించడం సంతోషకరమని అన్నారు.
కరీంనగర్ పట్టణంలో ఐదవ సారి రథయాత్ర జరగడం, ప్రతి ఏటా భక్తుల ఆదరణ పెరగడం శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి, పరిశ్రమల శాఖ మంత్రి గడ్డం వివేక్, మునూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






