అన్నారం పోస్ట్‌మాస్టర్‌పై విచారణ
విజయక్రాంతిలో ప్రచురితమైన పింఛన్ చిల్లర దోపిడీ కథనానికి స్పందన
జిల్లా అధికారుల పనితీరుపై దుమ్మెత్తి పోసిన పింఛన్ దారులు
తుంగతుర్తి, ఏప్రిల్ 6 : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ గత కొంత కాలం నుండి పించన్దారులకు 16 రూపాయల పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై విజయ క్రాంతి దినపత్రికలో పింఛన్ చిల్లర దోపిడి కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే దీనికి స్పందించిన సూర్యాపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి ఐపి బుచ్చిబాబు అన్నారం గ్రామానికి పోస్ట్ ఆఫీస్ లో జరిగిన అవకతలపై విచారణ నిమిత్తం సోమవారం రావడం జరిగింది. ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులను పిలిపించి వారి నుండి వ్యక్తిగత సమాచారం సేకరించారు.
కొంతమంది పింఛన్దారులు ఆవేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల అవసరాల కోసం పోస్ట్ ఆఫీస్ లను ఏర్పాటు చేసి, ప్రజలతో మమేకమై, ప్రజల అవసరాలను తీరుస్తున్న తరుణంలో, పోస్టుమాస్టర్ ఉద్యోగంలో ఉండి, ఒకపక్క నిర్లక్ష్యం, మరొక పక్క పింఛన్ అవినీతి జరగడం దారుణమని విమర్శించారు. దీనితో జిల్లా అధికారి అవసరమైతే మరో రెండు మార్లు వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అవకతవకలు జరిగినట్లు విచారణలో నిరూపణ అయితే పోస్ట్ మాస్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు . దీనితో కొంత ఘర్షణ సద్దుమణిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, పింఛన్దారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




