31 July, 2026 | 5:03 AM

ఇందిరమ్మ ఇళ్లలో ముషీరాబాద్‌కు అన్యాయం

31-07-2026 12:00 AM
  1. బీఆర్‌ఎస్ నేతల ఆరోపణ
  2. నియోజకవర్గంలో వెంటనే పథకం అమలు చేయాలని డిమాండ్

ముషీరాబాద్, జూలై 30(విజయక్రాం తి): ఇందిరమ్మ ఇల్లు పథకం అమలులో ముషీరాబాద్ నియోజకవర్గానికి తీవ్ర అ న్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వారు రాంనగర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో  మాట్లాడుతూ  ఎన్నికల సమయం లో పేదలకు ఉచిత ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

రూ.6 లక్షల వ్యయం, దరఖాస్తు రుసుము లు వంటి నిబంధనలతో పథకం పేదలకు అందని ద్రాక్షగా మారిందని ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో 360 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషం మల్లేష్, కల్వ గోపి, నేత శ్రీనివాస్, అజయ్ ముదిరాజ్, చిట్టి శ్యాంసుందర్, సిరిగిరి శ్యామ్, పున్న సత్యనారాయణ, బండా యుగేందర్, కొండ మాధవ్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.