4 May, 2026 | 2:04 AM

కేపీఆర్‌ఐటీలో ముగిసిన జాతీయస్థాయి ఆరోహణ 2026

04-05-2026 12:38 AM

ప్రత్యేక ఆకర్షణగా పలువురు సినీ ప్రముఖులు

ఘట్‌కేసర్, మే 3 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి ఘనపూర్ లోనికొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఆరోహణ 2026 ఉత్సవం ముగిసింది.  మొదటి రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ లో వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, టెక్నికల్ ఈవెంట్స్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్ ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. సాయంత్రాల్లో నిర్వహించిన కల్చరల్, మ్యూజికల్ నైట్స్ విద్యార్థులను ఉత్సాహభరితంగా ఆకట్టుకున్నాయి.

వార్షికోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈకార్యక్రమానికి కేపీఆర్‌ఈఎస్ యాజమాన్యం చైర్మన్  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్, కార్యదర్శి కొమ్మూరి రాకేష్ రెడ్డి, డైరెక్టర్ కొమ్మూరి దివ్యశ్రీ , అలాగే డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ‘వేదవ్యాస్’ సినిమా బృందం దర్శకుడు ఎస్.వి. కృష్ణ రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, హీరో విశ్వనాథ్ , హాస్యనటుడు రఘుబాబు హాజరై వేడుకలకు మరింత ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రం కేపీఆర్‌ఈఎస్ చైర్మన్ నిర్మాణంలో రూపొందడం విశేషం. కార్యక్రమం చివరగా నిర్వహించిన మ్యూజికల్ నైట్లో టాలీవుడ్ గాయకులు హారిక నారాయణ్, సమీరా భారద్వాజ్, అరుణ్ కౌండిన్య తమ గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్ ఆధ్వర్యంలో, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.