25 June, 2026 | 2:04 AM

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం

25-06-2026 12:53 AM

కేసీఆర్ హయాంలోనే హిట్లర్ రాజ్యం: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోం దని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కొని యాడారు. తెలంగాణలో హిట్లర్ ప్రభుత్వం నడుస్తుం దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ మల్లు రవి ఖండించారు. బుధవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియతో మాట్లా డారు. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే 27 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలను పెంచారని, ఏడున్నర లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రెండు లక్షల రైతు రుణమాఫీ, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని ఎంపీ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలు గా చేశారనే విషయం కేటీఆర్ గుర్తుంచుకో వాలని మల్లు రవి తెలిపారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులకు అపా యింట్‌మెంట్ లభించలేదని, అందుకే ప్రజ లు హిట్లర్ పాలనకు తగినరీతిలో గుణ పాఠం చెప్పారని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను హరీష్‌రావు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు.