8 July, 2026 | 2:01 AM

అంతర్ జిల్లా దొంగల అరెస్టు, 5 సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం

08-07-2026 12:58 AM

వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ : వీరప్రసాద్

వేములవాడ, జూలై 7 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ టౌన్ పోలీసులు అంతర్ జిల్లా స్థాయిలో సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, అనుమానాస్పదంగా తిరుగుతున్న కరీంనగర్కు చెందిన దుర్గం సాయి కృష్ణ (23), ఎస్కే సల్మాన్ (25)లను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

వారి వద్ద నుంచి ఏపి15 ఏఎస్ 2592 నంబర్ గల హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్తో పాటు 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వస్తువులను విక్రయించి వచ్చిన డబ్బును మద్యం, ఇతర విలాసాలకు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. గతంలో వీరిపై కరీంనగర్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లలో దొంగతనం, గంజాయి కేసులు నమోదై జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ రామ్మోహన్, పీసీలు గోపాల్, ఖాజా ఇమ్రానుద్దీన్, సల్మాన్లను ఇన్స్పెక్టర్ వీర ప్రసాద్ అభినందించారు. అలాగే ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.