ఫిల్ సాల్ట్ మెరుపులు
ఇంగ్లాండ్ భారీస్కోరు
రాణించిన ప్రిన్స్ యాదవ్
నాటింగ్‌హామ్, జూలై 7: భారత్‌తో జరుగుతున్న మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ భారీస్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బట్లర్, సామ్ కరన్ మెరుపులు తోడవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే రవి బిష్ణోయ్‌పై వేటు వేసి ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
తొలి ఓవర్‌నే అర్షదీప్‌సింగ్ మెయిడెన్ చేయడంతో ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. అయితే రెండో ఓవర్ నుంచి బట్లర్ , సాల్ట్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 21 బంతుల్లోనే 36(4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసిన బట్లర్‌ను ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన రెండో ఓవర్‌లో బ్రూక్(16)ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. అయితే సాల్ట్, బెథెల్ మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సాల్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెథెల్ (13), టామ్ బాంటన్(0)లను హర్షిత్ రాణా ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా సాల్ట్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలు బాదాడు. సామ్ కరన్ కూడా అతనికి తోడవడంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు వేగం టాప్‌గేర్‌లో సాగింది. సాల్ట్ 44 బంతుల్లో 70 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత విల్ జాక్స్, సామ్ కరన్ 34 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసిం ది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సామ్ కరన్ 24 బంతుల్లోనే 41 (4 ఫోర్లు) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 30 పరుగులకు 2 వికెట్లు తీసాడు. హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
స్కోరు బోర్డు: ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 201/7 (సాల్ట్ 70, బట్లర్ 36, సామ్ కరన్ 41 బ్రూక్ 16 ; ప్రిన్స్ యాదవ్ 2/30, రాణా 2/40)






