ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం
- టీఆర్‌ఎస్ పేరుపై ట్విస్ట్
- పార్టీ పేరు ఖరారులో మరింత ఆలస్యం?
- కవిత పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 7: ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాకే కోర్టుకు రావాలని, లేనిపక్షంలో ఎన్నికల సంఘం విధులు, అధికారా ల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సమితి) పేరు తమ పార్టీ పేరుగా ఖరారు చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను మంగళవారం విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ అభ్యంతరాల్లో హేతుబద్ధత ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు అభిప్రాయంతో టీఆర్‌ఎస్ పార్టీ పేరు, రిజిస్ట్రేషన్, గుర్తు తదితరాలపై మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కవిత కొత్తపేరుతో ముందుకు వెళతా రా? లేక అదే పేరుపై కోర్టులో న్యాయపోరాటానికి దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని, గుర్తులను, పాత పేర్ల ను పోలిన విధంగా ఉండకూడదని, ఈ పేరు పై వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ కవితకు రాసిన లేఖలో పేర్కొంది.






