128 కిలోల ఎండు గంజాయి దహనం
08-07-2026 12:05 AM
మహబూబాబాద్, జూలై 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన రూ. 64.24 లక్షల విలువైన 128.496 కిలోల ఎండు గంజాయిని ‘ఈగల్ ’ ఆదేశాల మేరకు చట్టప్రకారం పూర్తిగా దహనం చేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థాన అనుమతితో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 64,24,800 రూపాయల విలువ గల 128.496 కిలోల పొడి గంజాయిని నిబంధనల ప్రకారం పూర్తిగా నాశనం చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ పోలీస్ బృందం ఆధ్వర్యంలో ఈ మాదక ద్రవ్యాలను నిర్దేశిత వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్ లో ప్రత్యేక యంత్రాల ద్వారా పూర్తిగా దగ్ధం చేసి నాశనం చేశారు.






