9 May, 2026 | 6:45 PM

పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

09-05-2026 05:00 PM

కేసముద్రం,(విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి మెరుగైన జీవితానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమా నాగేశ్వరరావు అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లబ్ధిదారు తురక రాదమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.