9 May, 2026 | 6:47 PM

కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం

09-05-2026 05:02 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలను కె.యు.హ్యుమానిటీస్ బిల్డింగ్ లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని  కె యు.ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు సభ్యుడు చిర్ర రాజ్ గౌడ్, ప్రముఖ గాయకుడు వరంగల్ శ్రీనివాస్, దార దేవేందర్, పోటీల నిర్వహకుడు జూపాక శివతో కలిసి ప్రారంభించారు. 

అనంతరం ప్రొఫెసర్. మామిడాల ఇస్తారి మాట్లాడుతూ కాకతీయుల చరిత్ర చాలా గొప్పదని, జానపద కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలోనే వరంగల్ సంస్కృతి సాంప్రదాయాలకు  కు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ వల్ల వరంగల్ వైభవము దేశ నలుమూలల వ్యాప్తి చెందుతుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న కలలను బ్రతికించుకుందామని, కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.