30 May, 2026 | 2:39 AM

మహిళా సాధికారతకు వేదికగా ఇందిరా మహిళా శక్తి భవనం

30-05-2026 01:30 AM
  1. జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో భవన నిర్మాణ పనులు 
  2. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 29(విజయ క్రాంతి) : తెలంగాణలో మహిళా సాధికారతకు వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరితగతిన. పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  జిల్లా కేంద్రంలోని. ధ్యాన్చంద్  చౌరస్తా ఏరియా దగ్గర ఉన్న గాంధీనగర్ ఏరియాలో నిర్మాణం తుది దశకు చేరుకున్న ఇందిరా మహిళా శక్తి భవన  నిర్మాణ పనుల సంబంధిత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ నరసింహులు తో కలిసి పనుల పురోగతి,  క్షేత్రస్థాయిలో పరిశీలించి  అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో మంజూరై ఇందిరాస్ మహిళా శక్తి భవనం నిర్మాణం చేపట్టి తుది దశకు చేరుకుందని ఇంకా మిగిలి ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని, మహిళల శిక్షణకు, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవనాన్ని ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.  ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

భవన నిర్మాణ ప్లాన్లు, గదుల నిర్మాణం, మౌలిక వసతుల పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.  స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పరిశీలనలో పంచాయతీ రాజ్ ఈఈ నరసింహులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.