30 May, 2026 | 2:11 AM

పంటల వైవిధ్యీకరణ అత్యంత అవసరం

30-05-2026 01:28 AM

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ వీసీ డా. రాజిరెడ్డి

గజ్వేల్, మే 29: రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ అత్యంత అవసరమని, రైతులే దీనికి టార్చ్ బేరర్లుగా ముందుండాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండా రాజిరెడ్డి అన్నారు. ములుగు, సిద్ధిపేటలోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కమిటీ (జెడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశానికి ఆయ న అధ్యక్షత వహించారు. భవిష్యత్తులో సంభవించే సూపర్ ఎల్నినో ప్రభావాలను దృష్టి లో ఉంచుకుని ముందస్తు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేయాల్సి న అవసరం ఉందన్నారు.

ఎరువులు, పురుగుమం దుల వినియోగాన్ని తగ్గిస్తూ సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్‌ఎమ్), సమగ్ర పురుగు నియంత్రణ (ఐపీఎమ్) పద్ధతులను రైతులకు విస్తృతంగా చేర్చాలని విస్తరణ నిపుణు లకు సూచించారు. జీవ నియంత్రణ పద్ధతులు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమని పేర్కొం టూ, అధిక ఎరువుల వినియోగం వల్ల నేల కాలుష్యం పెరిగి మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నా రు. ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసే విధంగా ప్రామాణిక విధానాలు అమలు చేయాలని సూచిం చారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అగ్రి హార్టీ సొసైటీ కార్యదర్శి, ఐసీఏఆర్ పాలక మండలి సభ్యుడు కె. వీరభద్రరావు మాట్లాడుతూ తెలంగాణలో పాడైపోయిన పాలీహౌస్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉద్యా న శాఖ సంయుక్త సంచాలకులు సంగీత లక్ష్మి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. భగవాన్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ సురేష్ కుమార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయ ణ, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.