3 August, 2026 | 3:58 AM

మహిళల ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన

03-08-2026 01:31 AM

ముంబై, ఆగస్టు 2: వచ్చే నెలలో జరగనున్న మహిళల ఆసియాకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. అమితాశర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ టీంను ఎంపిక చే సింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్‌కు ఆసియాకప్ జట్టులో చో టు దక్కలేదు.ఆమె స్థానంలో ప్రేమా రావత్‌నే కొనసాగించారు.క్రికెటర్ల గాయాలను దృష్టిలో ఉంచుకుని ఐదుగురు రిజర్వ్ ప్లేయర్స్‌ను కూడా ఎంపిక చేశారు. 

భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), షెఫాలీ, జెమిమా, ఫుల్మాలి, దీప్తి శర్మ, రీచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.