చరిత్ర సృష్టించిన తన్వీ శర్మ
తైపీ ఓపెన్ టైటిల్ కైవసం
తైపీ సిటీ, ఆగస్టు 2: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తైపీ ఓపెన్‌ను కైవసం చేసుకుంది. ఆమె కెరీర్‌లో ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్. టోర్నీ ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న తన్వీ తుది పోరులోనూ అదరగొట్టింది. ఫైనల్లో వియాత్నాంకు చెందిన థుయ్ లిన్ ఎంగుయెన్‌పై 21 21 స్కోరుతో విజయం సాధించింది. రెండు గేమ్స్‌లోనూ తన్వీ పూర్తి ఆధి పత్యం కనబరిచింది.
కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. 2008లో సైనానెహ్వాల్ తొలిసారి తైపీ ఓపెన్ గెలవగా, ఆమె తర్వాత ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన్వీ రికార్డులకెక్కింది. 17 ఏళ్ల తన్వీ శర్మ గత రెండేళ్లుగా మేజర్ టోర్నీల్లో నిలకడగా రాణిస్తోంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్ 300 ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన తన్వీ ఈ సారి మాత్రం అవకాశాన్ని వదలుకోలేదు. పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే సాంగ్ శిక్షణలో రాటుదేలిన తన్వీ భవిష్యత్తులో భారత బ్యాడ్మిం టన్ ఆశాకిరణంగా నిలుస్తోంది.






