18-02-2026 12:00:00 AM
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 : భారత్ అతిథ్యమిస్తున్న ఏఐ ఇంపార్ట్ సదస్సులో సరైన సౌకర్యాలు లేకపోవడంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. సదస్సు సజావుగా, సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ సమిట్ ఈరోజు 70వేల మంది ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. సోమవారం జరిగిన సమిట్‌లో ఎవరైనా సమస్యలు ఎదుర్కొని ఉంటే దానికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతున్నాం.
మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి మా బృందం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది’ అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా, సోమవారం సాయంత్రం ఏఐ సమ్మిట్ ప్రారంభమైన సమయంలో భారత మండపం వద్ద సిబ్బంది రద్దీని నియంత్రించకపోయారని ( పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వెనకగా పేర్కొన్నారు. అందరికి సరిపడా కుర్చీలు, ఇతర సదుపాయాలు లేవన్నారు.