06-02-2026 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఇండిపెండెంట్ ల గుబులు పట్టు కుంది. బి ఫామ్ దక్కని అభ్యర్థులు పలువురు ఇండిపెండెంట్గా రంగంలో ఉన్నారు. పార్టీల అభ్యర్థులు ఎంత నచ్చ చెప్పిన తమకు టికెట్టు ఇస్తామని చివరి నిమిషంలో చేతి ఇచ్చారని టికెట్ దక్కని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు రిజర్వేషన్ కలిసి వచ్చిన చివరి నిమిషంలో బీఫామ్ ఇవ్వకపోవడంతో రంగంలో ఉండమని ఓ సీనియర్ నేత తమ ఆవేదన వ్యక్తం చేశాడు. గెలిచినా ఓడిన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన రెబెల్ అభ్యర్థులు
పార్టీల అభ్యర్థులకు రెబల్ గా ఇండిపెండెంట్గా పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా గెలిచి తీరుతామని ప్రచారం చేపట్టారు. దీంతో పార్టీ అభ్యర్థులకు ఓటమి గుబులు పట్టుకుంది. రెబెల్ గా ఉన్న వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేశారు.
అన్ని పార్టీలలో రెబల్ అభ్యర్థులు
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలలో అందరికీ చివరి సమయంలో పార్టీ బీఫామ్ టికెట్లు దక్కకపోవడంతో పోటీలో ఉన్నారు. పార్టీ అభ్యర్థులకు రెబెల్ గా పోటీ చేస్తుండడంతో పార్టీ అభ్యర్థు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ అభ్యర్థులు పోటీల్లో ఉంటే తమ గెలుపు సునాయాసం కాదని రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి విరమించేలా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. అధికార పార్టీకి చెందిన వారు బీఫామ్ కోసం ఒక్కో వార్డులో ముగ్గురు వరకు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒకరికే బీఫామ్ పార్టీ అధినేతలు అందజేయడంతో బి ఫామ్ దక్కని వారు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో పార్టీ అభ్యర్థులు గూగుల్ చెందుతున్నారు. ఇన్ని రోజులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తే ప్రస్తుతం ప్రచారం చేసుకుందామ అనుకుంటే రెబెల్స్ అభ్యర్థులు పోటీలో ఉండడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పార్టీల అభ్యర్థులు ఉన్నారు.