8 August, 2026 | 3:09 AM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

08-08-2026 01:03 AM

నిర్మల్ ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ని ర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కు మార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించాలన్నారు.

వేదికను అందంగా ముస్తాబు చేయాలన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించా లని అన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండా లన్నారు. టెంట్, షామియానా, తాగు నీరు ఏర్పాటు చేయాలని చెప్పారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.