8 August, 2026 | 3:58 AM

నేరస్తులు ఇక తప్పించుకోలేరు

08-08-2026 01:05 AM

నిర్మల్ ఆగస్టు 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన వరస దొంగతనాలు నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నిర్మల్ పట్టణం చుట్టూ చుట్టూ ఏడూ చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

పట్టణంలోని కొండాపూర్ సోఫీ నగర్, గాజులపేట్ బంగల్పెట్ సిద్దాపూర్ శాంతినగర్ ఎల్లంపల్లి రోడ్డు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను శున్ణంగా తనిఖీ చే సి కొత్తవారు కనిపిస్తే ఆధార్ కార్డ్ చెక్ చేస్తున్నారు. రాత్రి వేళలో గస్తీ తిరుగుతూ రోడ్లపై నిగా పెడుతున్నారు. ఈ కేంద్రాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా పరిశీలించి అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య అధికారులు ఉన్నారు