23 March, 2026 | 11:28 PM

ఉరుమడ్ల గ్రామంలో సిసి రోడ్డు పనుల ప్రారంభోత్సవం

23-03-2026 09:19 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సోమవారం ప్రారంభించారు. ఉరుమడ్ల గ్రామంలో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో సమకూర్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు,  గంగాపురం రాము, మేడబోయిన స్వాతి శ్రీను  మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను, ​సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, బొడ్డు శ్రీను, రూపని భిక్షం, కురుపటి లింగయ్య, సాగర్ల మల్లేష్, కొండా శ్రీను మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.