మెల్లకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం గృహప్రవేశం గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరై గ్రామస్తులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నూతన ఇల్లు నిర్మాణం ఇందిరమ్మ ఇల్లుతో కల నెరవేరిందన్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణలు ఇంద్రగాంధీ,వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు కావడం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంద్రగాంధీ,వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
పేద ప్రజల కోసం ఇంద్ర గాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏవిధంగా పాటుపడ్డారో అదే మాదిరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ పేద ప్రజలే సంక్షేమంగా భావిస్తున్నారు. అందుకోసమే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం తెలంగాణ ప్రజలు మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్య నాయక్, మాజీ సర్పంచ్ కేస్లీ వాసురం నాయక్, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




