9 June, 2026 | 2:45 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు

09-06-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జూన్ 8(విజయ క్రాంతి) : వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిల అభివృద్ధి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో గల పిల్లి కొట్యాల్  ఏరియాలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జి జి హెచ్ ఎస్  సూపరిండెంట్ డాక్టర్  సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆర్‌ఎంఓ డాక్టర్ షర్మిల, జి జి హెచ్ ఎస్ ఆర్ ఎం ఓ రేవతి, డి సి హెచ్ ఎస్ శివదయాల్, ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా, హెచ్ ఓ డి జనరల్ మెడిసిన్ డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ రాజేశ్వరి , మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ పావని, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బోస్ రాజశేఖర్ , బోని,  కౌన్సిలర్ విశ్వం లతో కలిసి ఆసుపత్రుల అభివృద్ధి సంఘం సమావేశానికి  జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం  ఆసుపత్రి అభివృద్ధి పనులకు గాను అవసరమైన బడ్జెట్ కేటాయింపు కొరకు ప్రతిపాదించడం జరిగిందని, ఇందులో భాగంగా ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది నియామకం, ఆసుపత్రి నిర్వహణ, అంబులెన్స్ ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స, వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లుల కోసం చర్చించడం జరిగింది అన్నారు.

ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఆ దిశగా నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని వార్డులు, పరిసర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, , ఆసుపత్రిలో ప్రజా ప్రయోజనకరంగా అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మించి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్రిటికల్ కేర్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించి, వైద్యాధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.