11 March, 2026 | 7:49 AM

జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు

11-03-2026 01:26 AM

నిర్మల్, మార్చి 10(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాదు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పల్లెపాలన ప్రగతి ప్రణాళిక పై పలు సూచనలు చేశారని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఈ పథకం అమలుపై జూన్ మీటింగ్ మాట్లాడారు.

ఈ నెల 12వ తేదీన, సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్ లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.       ఈ వీసీలో అదనపు కలెక్టర్‌లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార, సిపిఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.