11 March, 2026 | 4:34 AM

అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి

11-03-2026 01:27 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 10(విజయక్రాంతి): పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవనంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళ వారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, కౌన్సిలర్లతో కలిసి ఉద్యానవనాన్ని పరిశీలించి పట్టణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు వినోద్, స్వప్నరాణి, కృష్ణమ్మ, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.