భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): భూభారతి, సాదా బైనామా దర ఖాస్తులు, భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సీసీఎల్‌ఏ, ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. నక్ష సర్వే, ల్యాండ్ అంశాలు సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కమిషనర్ ల్యాండ్ సర్వే, సెటిల్మెంట్స్, ల్యాం డ్ రికారడ్స్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వే కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే, భూభారతి, సంబంధిత అధికారులతో కలిసి కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ భూ స మస్య, జిల్లాలోని సాదా బైనామా, భూభారతి దరఖాస్తులు, రెవెన్యూ సదస్సులు, నక్ష సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించా రు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న భూభారతి, సాదా బైనామా చట్టాలు అర్హులైన నిజ మైన రైతుల భూ సమస్యల పరిష్కారం కో సం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే నిర్వహించి అమలుపరుస్తుందని, అందుకోసం రెవెన్యూ, ల్యాండ్ సర్వే సంబంధిత అన్ని విభాగాల అధికారులు అంకితభావంతో పనిచేయాలని తద్వారా రైతులకు, ప్రజలకు ఉన్న భూ సమస్యలను పరిష్కార మార్గం చూపెడతాయని తెలిపారు.
కేసముద్రం మం డలం నారాయణపురం తదితర గ్రామాల భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రత్యేక విభాగం క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతుందని, అటవీ, రెవెన్యూ, ల్యాండ్ సర్వే శాఖల సర్వేల ద్వారా రైతులకు సమాచారం అందించి త్వరితగతిన పరిష్కారం చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూభారతి, సాదా బైనామాలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని అందుకోసం ప్రత్యేకంగా గ్రామ పరిపాలన అధికారిలను నియమించాలని, ఖచ్చితమైన సమాచారం ద్వారా సమాచారం సేకరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రత్యేకించి నారాయణపురం విషయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో ఒక విభాగాన్ని నియమించి సర్వే పరిశీలన తదితర అంశాలను సేకరించి సాధ్యమైనంత త్వరగా భూ సమస్యను పరిష్కారం చేసి అర్హులైన వారిని గుర్తిస్తామని తెలియజేశారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను సేకరిగేషన్ చేసి మండలాల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. నక్ష సర్వే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్న సర్వేను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లకు వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సర్వే ల్యాండ్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న, డిప్యూటీ డైరెక్టర్ సమీరా బేగం, అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్. శ్రీనివాసులు, మహబూబాబాద్ ఆర్డిఓ రాజేశ్వరి, కేసముద్రం తహసిల్దార్ వివేక్, సంబంధిత విభాగాల పర్యవేక్షకులు మదన్ గోపాల్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.






