17 April, 2026 | 11:54 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులు

12-02-2026 02:19 AM

ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ ఫిబ్రవరి 11 వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందన్న భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కలిసి మా నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించడం సమంజసం కాదని ఎమ్మెల్యే విజయుడు ఫైర్ అయ్యాడు. బుధవారం వడ్డేపల్లి మున్సిపాలిటీ లో తమ పార్టీకి చెందిన నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులను ఖండిస్తూ ... పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని పరామర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...అధికార కాంగ్రెస్ పార్టీ ఇతర చోట మోట పార్టీలు ఓటమి భయంతోనే ఇలాంటి పనులను చేయిస్తున్నట్లు  ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వడ్డేపల్లి మున్సిపాలిటీలో వందకు వంద శాతం బీఆర్‌ఎస్ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు సాగనీయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.