12-02-2026 02:18:06 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 11 ( విజయక్రాంతి ) : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 23వార్డు బూతు నం 1 లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలింగ్ ప్రక్రియ,కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన సంఘటనలు మన కళ్ళముందు జరిగాయి ఉదాహరణకు సోలీపూర్, సవాయి గూడెంలో జరిగిందన్నారు. ప్రజల అభీష్టం అనేది ప్రలోభాలకు అతీతంగా నిర్భయంగా,నిష్పాక్షికంగా వెల్లడి కావాలన్నది ఎన్నికల నియమావళి యొక్క ఉద్దేశం ఆది నెరవేరాలన్నది మా డిమాండ్ అని ఆయన తెలిపారు.