8 March, 2026 | 3:35 AM

9న జాతీయ స్థాయి కామర్స్ టాలెంట్ టెస్ట్

08-03-2026 01:54 AM

ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఐఐఎంసీ కళాశాల 

ఖైరతాబాద్, మార్చి 7(విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కొత్తగూడలోని ఫ్లోరా ఎడ్జ్ సంస్థ సంయుక్తంగా ఈ నెల 9న జాతీయ స్థాయి కామర్స్ టాలెంట్ టెస్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో ఆర్థిక శాస్త్రం, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో, వాణిజ్యం, సంబంధిత విషయాల్లో సంభావిత జ్ఞానాన్ని, ప్రతిభను అన్వేషించడం, అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ‘జాతీయ స్థాయి కామర్స్ టాలెంట్ టెస్ట్ (ఆన్ లైన్)’ను నిర్వహించనున్నారు.

ఇందులో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ జాతీయ స్థాయి కామర్స్ టాలెంట్ టెస్టుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తూ తెలియజేశారు. ఈ పరీక్షలో అకౌంటెన్సీ, ఎకనామిక్స్, బిజినెస్ ఆర్గనైజేషన్, బ్యాంకింగ్, స్టాటిస్టిక్స్, స్టాక్ మార్కె ట్, కామర్స్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్ ప్రాథమికాంశాలకు సంబంధించి 120 బ హుళైచ్చిక (మల్టిపుల్ ఛాయిస్) ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు ఉంటా యి. ఈ పరీక్షకు సంబందించిన గూగుల్ అంతర్జాల లింకు మా కళాశాల వెబ్‌సైట్ www.iimchyd.ac.inలో మార్చి 9న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో పాల్గొని బహుమతులు గెలుపొందవలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు. జాతీయ స్థాయి కామర్స్ టాలెంట్ టెస్ట్ కు సంబందించిన మరిన్ని వివరాల కోసం 9052810 304, 9052263033, 9989343089, 9502271736, 9441867976, 955316 2767 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు. కామర్స్ టాలెంట్ టెస్ట్ బ్రోచర్ కోసం కళాశాల వెబ్‌సైట్ చూడగలరు.