15 March, 2026 | 3:25 AM

కుల మతాలకతీతంగా ఇఫ్తార్

15-03-2026 12:28 AM
  1. విందులో అందరు పాల్గొనడం మన సంస్కృతికి గొప్ప నిదర్శనం
  2. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు 

 ఖమ్మం, మార్చి 14(విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన శనివారం ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూ రి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈ జేఏసీ సెక్రెటరీ జనరల్ శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రెవెన్యూ హాజరయ్యారు,

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రంజాన్ అనేది కేవలం ఉపవాసం ఉండే నెల మాత్రమే కాదు, ఇది ఆత్మశుద్ధి చేసుకునే నెల. ఈ పవిత్ర మాసంలోనే దివ్య ఖురాన్ భూమిపైకి అవతరించింది. అందుకే ముస్లిం సోదరులందరూ ఈ నెలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పండగ ప్రాముఖ్యత వివరించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ‘ఇఫ్తార్’ విం దుల్లో పాల్గొనడం మన భారతీయ సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనం అన్నారు. ముస్లిం మత పెద్దలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం ఇఫ్తార్ విందుని స్వీక రించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, గంగవరపు నరేందర్, ట్రెజరర్ సూరంపల్లి రాంబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ బి విజయకుమార్, టీజీవో మాజీ అధ్యక్షులు కష్టాల సత్యనారాయణ,టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసు రావు, కొనిదెన శ్రీనివాసరావు, టీఎ న్జీవో కార్యవర్గ సభ్యులు వెంకన్న, దుర్గాప్రసాద్, తాళ్లూరు శ్రీకాంత్, ఏలూరి కోనర్, నాలుగో తరగతి సంఘ అధ్యక్ష కార్యదర్శు లు నాయకులు బిక్కు నాయక్, కాంపాటి వెంకటరమణ, డ్రైవర్ సంఘ అధ్యక్షులు, వెంకటేశ్వరరావు, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, షేక్ అస్లాం, సయ్యద్  జిలాని, ఏమే హలీం గారు, ఎండీ ముజాహిద్, ఏంఏ గౌస్, తాజుద్దీన్, జహీరుద్దీన్, జి పుల్లయ్య,రెవెన్యూ అసోసియేషన్, శేఖర్ రంజాన్ అలీ యుటిఎఫ్ అధ్యక్షులు, డాక్టర్ రమేష్ బాబు, పరిషిక పుల్లయ్య, మే దరమెట్ల సుబ్బయ్య ,కళ్యాణ నాగేశ్వరరావు, షేక్ మున్సూర్, వెంకటరావు, వై వెంకటేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.