దమ్ముంటే ధరలు దించు
- మాటలు దంచుడు కాదు రేవంత్..
- మీది ప్రజా పాలన కాదు.. పన్నుల దండుకునే ప్రజా పీడన పాలన
- సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, మే25 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్‌ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యంచూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీమంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి, రాష్ట్ర పన్ను లు తగ్గించాలి’ అని నాడు పీసీసీ హోదా లో ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీశారు.
ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కా దు, ద మ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి పెట్రో ల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. మీది ప్రజా పాలన కాదు.. పన్నులను దండుకునే ప్రజాపీడన పాల న అన్నారు. వారంలో నాలుగు సార్లు ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే, మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించడం లేద న్నారు. పెరిగిన సాగుఖర్చులు భరించలేక రైతు లు గోస పడుతున్నారని అన్నారు.






