15 June, 2026 | 10:38 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పర్సంటేజీ ఇవ్వకుంటే థియేటర్లు మూసేస్తాం

11-04-2026 12:00 AM

సినిమా థియేటర్లలో రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సంటేజీ సిస్టమ్‌ను అమలు చేస్తూ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఇటీవల నిర్ణయం ప్రకటించడం, పర్సంటేజీ విధానానికి తాము వ్యతిరేకమని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడం తెలిసిందే. గతంలో అద్దె ప్రాతిపదికన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగేవి.

మల్టీప్లెక్స్‌ల తరహాలోనే హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు పర్సంటేజీ విధానంలో సినిమాలన ప్రదర్శించాలంటూ ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇటీవల ప్రకటన వెలువరించిది. మరోవైపు పర్సంటేజీ ఇస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది.

ఇతర రాష్ట్రాల్లో పర్సంటేజీ విధానమే అమలవుతోందని వెల్లడించింది. నిర్మాతల గిల్డ్ ప్రకటనపై తాజాగా మరోమారు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. తమ నిర్ణయాన్ని కాదని నిర్మాతల గిల్డ్ ఎలా స్పం దిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఏప్రిల్ 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పర్సంటేజీ ఇవ్వకుంటే మే 1వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ థియే టర్లు మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది.