10 March, 2026 | 7:25 PM

గిరిజన కళాఖండాలు తయారుచేసి విక్రయిస్తే గిరిజనుల గురించి నలుదిక్కులా వ్యాపిస్తుంది

10-03-2026 12:00 AM

లాల్ బహుదూర్ శాస్త్రి డైరెక్టర్ శ్రీరామ్

భద్రాచలం, మార్చి 9, (విజయక్రాంతి): గిరిజన మ్యూజియంలో పొందుపరిచిన వివిధ కళాఖండాలు తయారుచేసి మ్యూజియం తిలకించడానికి వచ్చే పర్యాటకులకు వాటి చరిత్ర మరియు గిరిజనుల ఉపయోగించిన విధివిధానాలు తెలియజేసి అమ్మకాలు జరిపితే గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభించడమే కాక జీవనోపాధి పెంపొందించుకోవడానికి కృషి చేసిన వారం అవుతామని లాల్ బహుదూర్ శాస్త్రి న్యూఢిల్లీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీరామ్ తరణి కంట్రీ సంబంధిత అధికారులకు తెలిపారు.

సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మ్యూజియం తిలకించడానికి వచ్చిన సందర్భంగా గిరిజన సంప్రదాయ ప్రకారము ఐటిడిఏ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మ్యూజియంలో పొందుపరిచిన కళాఖండాలను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించిన ప్రతి వస్తువు మ్యూజియంలో పొందుపరచడం చాలా బాగున్నాయని అన్నారు.

మ్యూజియంలో ప్రతి గదికి కలలకు సంబంధించిన వీడియో చిత్రీకరణ తీసి వీడియో షూట్ ద్వారా ప్రదర్శిస్తే పర్యాటకులకు గిరిజనుల యొక్క చరిత్ర త్వరగా అవగతం అవుతుందని అన్నారు. ఆదివాసి గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు చాలా రుచిగా ఉన్నాయని, మహిళలకు మరింత ఆదాయం చేకూరాలంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో అమ్మకాలు జరిగేల సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గిరిజనుల సంక్షేమం కొరకు ఏర్పాటుచేసిన ఐటీడీఏ కార్యాలయంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి విభాగము యొక్క జాబ్ చార్ట్ రూపొందించి తనకు పంపించాలని అన్నారు.

గిరిజనుల సంక్షేమం కొరకు విశేష కృషి చేస్తున్న ఐటీడీఏ పీవో బి రాహుల్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు అన్నారు. అనంతరం మ్యూజియం లోకి సంబంధించిన మెమొంటో మరియు గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లను డైరెక్టర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ,సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, లైజన్ ఆఫీసర్ మహేష్, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, మేనేజర్ ఆదినారాయణ మ్యూజియం నిర్వాహకులు, వీరాస్వామి, మాధవి ఇతర సిబ్బంది  పాల్గొన్నారు.