ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు
కరకట్ట పైన రంగులతో తీర్చిదిద్దల బాపు బొమ్మలు
సిద్ధమవుతున్న భక్తులకు స్వాగతం పలికే స్వాగత ద్వారాలు
ప్రారంభమైన కళ్యాణ సెక్టార్ టికెట్లు ఆన్లైన్ సేవలు
భద్రాచలం, మార్చి, 9 (విజయక్రాంతి) : దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలం పట్టణంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2 తేదీ వరకు జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్ము రంగా సాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వరకు కల్యాణ సమయంలో ముత్యాల తలంబ్రాలు సమర్పిం చడానికి మరల భద్రాచలం వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎటువంటి లోటపాట్లు లేకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఈ తరుణంలో రామయ్య వనవాస కాండను ప్రతిబింబించే విధంగా రూపొందించిన బాపు బొమ్మలకు రంగులు వేయడంతో బాపు బొమ్మలు పునర్జీవం పోసుకున్నాయి. అదేవిధంగా భక్తులందరూ భద్రాచలం వచ్చే ప్రయాణ మార్గాల ప్రారంభం వద్ద ఆకట్టుకునే విధంగా స్వాగత ద్వారాలు సిద్ధమవుతున్నాయి.
7 నుంచి సెక్టార్ టికెట్ల ఆన్లైన్ సేవలు
బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఈనెల 27వ తేదీన జరగనున్న శ్రీసీతారాములవారి తిరుకల్యాణం మహోత్సవం, 28వ తేదీన జరగనున్న పట్టాభిషేకం ఉత్సవం లో పాల్గొనేందుకు భక్తుల కొరకు ఆన్లైన్లో సెక్టర్ టికెట్లను విక్రయించేందుకు అధికారులు శుక్రవారం సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇందుకు గాను సెక్టార్లవారీగా రుసుమును కేటాయించారు. 7500 ( ఉభయ దాతలు), 2500, 2000, 1000, 300,150 రూపాయల వారీగా సెక్టార్ టికెట్లను విభజించారు. అదేవిధంగా నేర్వ సెక్టార్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయం వద్ద గల మెయిన్ టికెట్ కౌంటర్ వద్ద, తానీషా కల్యాణ మండపం( సిఆర్‌ఓ కార్యాలయం) నందు, బ్రిడ్జి పాయింట్, సబ్ కలెక్టర్ కార్యాలయం నందు టికెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.
ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు హెచ్ టీ టీ ఎస్ :// భద్రాద్రి టెంపుల్. తెలంగాణ. జివోవి అని వ్బుసైట్ నందు ఈ నెల 7వ తేదీ నుంచి బుకింగ్ చేసుకునేందుకు సదుపాయం కల్పించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ నందు సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈనెల 20 తేది ఉదయం 11 గంటల నుంచి 20వ తేది ఉదయం 6 గంటల వరకు దేవస్థానం తానిషా కళ్యాణ మండపం ( సిఆర్‌ఓ కార్యాలయం) నందు వారు ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపి ఒరిజినల్ టికెట్లు పొందవచ్చునని తెలియజేశారు.




