రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు
లారీలోకి ధాన్యం బస్తాలను ఎగుమతి చేపించిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్
తుంగతుర్తి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాలో కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ వందనాలు పవర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పాటు, పలు ఐకెపి ధాన్యం కేంద్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
సూర్య తండ మాజీ సర్పంచ్ నాకావత్ యాకో నాయక్ తమ గ్రామంలో బస్తాల్లో కాంటా పెట్టి ఉండమని లారీ లేక ధాన్యం సర్కు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధింత అధికారులతో మాట్లాడి లారీలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు పంపిన ధాన్యాన్ని, మిల్లర్లు యాజమాన్యం ఇస్తారాజ్యంగా కటింగ్ చేస్తే చర్యలు తప్పవు అన్నారు.
స్టేడియంలో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను లారీ పిలిపించి తక్షణమే బస్తాలను ఎగుమతి చేయించిన కలెక్టర్, దీనితో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, వేసవి తాపంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, లారీలు తెప్పించి ఎగుమతి చేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు తాసిల్దార్ దయానందం, ఏ డి ఏ రమేష్ బాబు, ఎంపీడీవో శేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






