అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసుల
బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఏమిటని బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సుల్తానాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టిఏ ద్వారా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బయట పెడితే అక్రమ కేసులు పెట్టడం ఏంటని అన్నారు.
కామారెడ్డిలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని న్యాయబద్ధంగా బయటపెట్టిన ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై కేసులు పెట్టడం సరైనది కాదని దానిని ప్రశ్నించేందుకు వెళుతున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ను అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పాలనకు అద్దం పడుతుందని అన్నారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ వారే ఉన్నారని, ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని రానున్న 2029లో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
గతంలో 9 సంవత్సరాలు బిఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు మించి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని పోలీసులు సైతం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల పని చేస్తున్నారని అన్ని నోట్ చేసి పెట్టుకుంటున్నామని తిరిగి ఇంతకు ఇంత ఇరు పార్టీల వారు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, పార్టీ శ్రేణులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మెండే శంకరయ్య, ఎల్లంకి రాజు, కొల్లూరి సంతోష్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, మల్కా భాగ్యలక్ష్మి, ఎర్రం సంతోష్ రెడ్డి, మహేష్ పటేల్, వలస సాయి, లతోపాటు పలువురు పాల్గొన్నారు.




