calender_icon.png 9 February, 2026 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తా

09-02-2026 02:16:50 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీలోని 13 వార్డులో జోరు అందుకున్న ఇంటింటి ప్రచారం. యాలల లావణ్య జైపాల్ రెడ్డి ప్రచారం జోరండుకుంది ప్రచారం లో భాగంగా లావణ్య రెడ్డి మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా తన వంతు సహాయంగా ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తెమెట్టలు చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. వెంకటేశ్వర కాలనీ మరియు సురంగల్ గ్రామంలో బస్టాండ్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ రాణి వారికి తనే సొంత నిధులు ఇస్తానని మాట ఇచ్చారు.

చాకలి వాళ్లకు దోబీగా నిర్మాణం చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. కట్ట మైసమ్మ దేవాలయం చెరువు కట్టపై వాకింగ్ టాక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 13వ వార్డులో ఎవరు చనిపోయినా కూడా తన వంతు ఆర్థిక సహాయం గా 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న దేవాలయాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటానని తెలియజేశారు. దయచేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడుగా మీ వెంట నడుస్తానని హామీ ఇచ్చారు.