calender_icon.png 9 February, 2026 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి

09-02-2026 02:17:58 AM

శంకర్ పల్లి, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని శంకర్ పల్లి మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వార్డులోని అయ్యప్ప రెడ్డి గూడ, సాయి నగర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వార్డులో ప్రధాన సమస్యలైన సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి పనులను చేపడతానని హామీ ఇచ్చారు. కాగా గతంలో 15వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది న తన సతీమణి విజయలక్ష్మి  చైర్ పర్సన్ గా చైర్ పర్సన్ గా బాధ్యత స్వీకరించి మున్సిపల్ లో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.

మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు మరింత ముందుకు వెళ్తానని తెలిపారు. ఇప్పటికే వార్డులో ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగిందని, మిగతా వారికి రెండో విడతలు ఇండ్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కాగా సాయి నగర్ లో ఆయనకు మద్దతుగా ఆయన సతీమణి సాత విజయలక్ష్మి ప్రచారం నిర్వహించారు.