23-02-2026 04:21:07 PM
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
సదాశివనగర్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండా గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే గ్రామ పంచాయతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యను గ్రామ పంచాయతీ సర్పంచ్ సంధ్య పాలక వర్గం సభ్యులు సన్మానించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామపంచాయతీ తండాలకు నూతనంగా పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తానన్నారు. వజ్జేపల్లి తండాలో నీటి సమస్య, పంచాయతీ భవన నిర్మాణం, రోడ్డు పనులను పరిస్కరం కోసం కృషి చేస్తానన్నారు. సర్పంచ్ సంధ్య-విజయ్ కుమార్ పాలక వర్గం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాండ నాయకులు పాల్గొన్నారు.