calender_icon.png 5 February, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40.70 కోట్లతో అభివృద్ధి పనులు

05-02-2026 01:48:59 AM

  1. రాయసముద్రం చెరువు సుందరీకరణ
  2. మీట్ మార్కెట్, పార్కులు ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): నగర శివారులోని రామచంద్రాపురం డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఏకంగా రూ.40.70 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం మోక్షం లభించింది. ఈ పనులకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించా రు.

రాయసముద్రం చెరువు సుందరీకరణ పనులు, చెరువులో మురికినీటి మళ్లింపు పనులు ఉన్నాయి. శ్రీనివాస్‌నగర్‌లో హిం దూ శ్మశానవాటిక, గాంధీ బాలవిహార్ పార్క్, ఓల్ రామచంద్రాపురంలో మీట్ మార్కెట్, మహిళా సమాఖ్య భవనం, థీమ్ పార్క్, పలు కమ్యూనిటీ హాళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. డివిజన్ అభివృద్ధికి కొత్తగా మంజూరైన నిధులతో చేపట్టనున్న పనులకు కూడా భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నాగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.