కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా..
మొగుళ్ల రాజిరెడ్డి..
జలమండలి ఎన్నికల విజేత మొగుళ్ల రాజరెడ్డికి ఘన సన్మానం
ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): జలమండలిలో ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతుతో విజయం సాధించిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్(ఐఎన్టీయూసీ) అధ్యక్షుడు మొగుళ్ళ రాజరెడ్డికి గురువారం హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఘన సన్మాన సభ నిర్వహించారు.
యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎం.నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజరెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. రాజరెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులను పట్టించుకోలేదని ఆరోపించారు.
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు వి.ఎస్.బోస్, కె. రాఘవేందర్ రాజ్, సయ్యిద్ అక్తర్, కె.రమేష్, ఎస్.కె.నరసింహ, ఎం. సత్యనారాయణ, జి.బి.సర్వేశ్వరరావు, ఆనంద్ కుమార్, జి.శంకర్, ఆర్. జంగయ్య, ఎన్.రాజయ్య పాల్గొన్నారు.






