28 July, 2026 | 1:21 AM

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

28-07-2026 12:25 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి, జూలై 27 (విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక సదుపాయా లను కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం ములకలపల్లి మండలంలోని చాపరాలప ల్లి, కుమ్మరిపాడు, గుట్టగూడెం పంచాయి తీ పరిధిలోని మామిళ్లగూడెం, ములకలపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రూ.46 లక్షల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి,సంక్షేమ పనులను ప్రారంభించడంతో పాటు నూతన పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.

సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. చాపరాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, కుమ్మరిపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మండల అధి కారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాహిర్, సర్పంచ్‌లు చంద్రలేఖ, రవి, మాజీ జెడ్పిటిసి అంజి, మాజీ సర్పంచ్ సుధీర్, సర్ మండల ఇంచార్జ్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.