20 March, 2026 | 1:35 PM

2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటా

20-03-2026 12:00 AM

పొడిగింపుపై బీసీసీఐకి అగార్కర్ విజ్ఞప్తి

ముంబై, మార్చి 19 : సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ తన పదవీకాలం పొడిగించాలని బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగుతానని బోర్డుకు చెప్పినట్టు తెలిసింది. అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు అద్భుతంగా రాణించింది. వన్డే ప్రపంచకప్ తప్పిస్తే ఇప్పటి వరకూ ఆడిన ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలిచింది.

అతడి హయాంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్, 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకపోవడం, స్వదేశంలో కివీస్‌పై వైట్‌వాష్ పరాభవాలు వెం టాడినప్పటకీ వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం భారత జట్టు మంచి ప్రదర్శనే కనబరిచింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు కూడా టెస్టులకు గుడ్ బై చెప్పేశారు.

ప్రస్తుతం వారి స్థానాలను భర్తీ చేసే క్రమంలో హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి యువ ఆటగాళ్లతో జట్టును నిర్మిస్తున్నాడు. కాగా ఇప్పుడు పదవీకాలం ముగిసే సమయం దగ్గర పడడంతో అగార్కర్ పొడిగింపు కోసం బీసీసీఐ కి విజ్ఞప్తి చేసాడు. నిజానికి 2025 ఐపీఎల్ సమయానికే అగార్కర్ పదవీకాలం ముగిసిపోగా బీసీసీఐ ఏడాది పాటు పొడిగించింది. కాగా జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపైనా విమర్శలు ఎదుర్కొన్నాడు. అభిమానులు, మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా తన నిర్ణయాలను అగార్కర్ బహిరంగంగానే సమ ర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవ లం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమనే మాటనే అగార్కర్ అనుసరించాడు. అయితే బీసీసీఐ అత ని విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ నుంచి మరో మాజీ క్రికెటర్ కూడా చీఫ్ సెలక్టర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.