12 June, 2026 | 3:10 AM

కాంగ్రెస్‌లో కోవర్టులుంటే తోడ్కలు తీస్తాం

12-06-2026 01:59 AM

బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోంది: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గలీజ్ రాజకీయాలు చేస్తోందని పీసీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో మూడో రాజ్యసభ సీట్ కోసం దిగజారుడు రాజకీయా లు చేసిందని, మీనాక్షినటరాజన్‌ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అడ్డుకుందని ఆయన దుయ్య బట్టారు. కాంగ్రెస్‌లో కోవర్టులుంటే తోలు తీస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

బీజేపీ చేసిన దొంగతనంపై చర్చ జరగకుండానే కాంగ్రెస్‌పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ నటరాజన్‌ను రాజ్యసభకు వెళ్లకుండా ప్రధాని మోదీ అడ్డుకోవడం అవసరమా..? అని నిలదీశారు. బీజేపీ ఓటు చోరితో గెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అన్ని సీట్లు గెలవడం ఎలా సాధ్యమవుతందని, ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను బీజేపీ కబ్జా చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ పన్నెండుళ్లుగా  కుట్రలు.. కుతంత్రాలతో పాలన సాగి స్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి మూడు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు..