calender_icon.png 6 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా

06-02-2026 12:03:59 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా షేక్పేట్ డివిజన్లోని ఓయూ కాలనీలో రూ. 138 కోట్ల అంచనా వ్యయంతో నూతన డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులను చేపట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పెం డింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్య మని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపు తామని ప్రకటించారు. జిహెచ్‌ఎంసి, జలమండలి ఉన్న తాధికారులతో సమన్వయం చేసుకుంటూ, కాంట్రా క్టర్లకు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.